News

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు

482views

ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన ’12U2′ గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లు హాజరుకానున్నారు. జులై 13-16 మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటన సందర్భంగా ఈ భేటీ జరగనుంది. ఆహార సంక్షోభం, టెక్నాలజీ, వాణిజ్యం, వాతావరణం, కోవిడ్, భద్రత, ఇతర అంశాల్లో పరస్పర సహకారంపై నాలుగు దేశాల అధినేతలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.