News

బల్లెం విసిరి నీరజ్ చోప్రా మరో రికార్డు

525views

టోక్యో: టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ విజేత నీరజ్​ చోప్రా మరో రికార్డ్​ సృష్టించాడు. జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఫిన్లాండ్​ ​ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీటర్లు బల్లెం విసిరి ఈ ఫీట్​ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో పటియాలా వేదికగా 88.07, టోక్యో ఒలింపిక్స్​లో 87.58 మీటర్లు విసిరి గోల్డ్​ మెడల్​ సాధించాడు. కాగా, ప్రస్తుత ఈవెంట్​లో అతడి రజత పతకం దక్కింది. తొలి రౌండ్​ను 86.92 మీటర్లతో ప్రారంభించిన అతడు.. తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్​ అయ్యాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 85.85 మీటర్లు విసిరాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి