
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అవసరాలకు రోజుకు కావాల్సిన నాలుగు వేల లీటర్ల పాలు, శ్రీవారి ఆలయానికి అవసరమైన నెయ్యి దేశీయ గోవుల నుండి సేకరించడం కోసం గోవుల సేకరణ ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని డాక్టర్ జవహర్‌రెడ్డి సూచించారు. దీంతోపాటు నెయ్యి తయారీ ప్లాంట్‌ను కూడా డిసెంబరులో ప్రారంభించడానికి పనులు వేగవంతం చేయాలన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో ఆదర్శ దేశీయ గోజాతి అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని గోశాలలను శాటిలైట్ గోశాలలుగా తయారుచేసి వీటిని ఎస్వీ గోసంరక్షణశాలకు అనుసంధానం చేయాలని సూచించారు. తద్వారా గోవులు కబేళాలకు పోకుండా కాపాడవచ్చని, వీటిని రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అందించవచ్చని తెలిపారు.
టీటీడీ ఆయుర్వేద ఫార్మశీ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి యంత్రాలను సమకూర్చుకుని ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రారంభించాలన్నారు. పంచగవ్య ఉత్పత్తులపై 20 శాతం వరకు రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా వీటి అమ్మకాలు పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్వీ గోశాలలో ఫీడ్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.





