News

ఆల్‌ఖైదా హెచ్చరికలతో భారత భద్రతా దళాలు అప్ర‌మ‌త్తం

462views

న్యూఢిల్లీ: భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగడంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ వ్యాఖ్యలపై ఓ లేఖ విడుదల చేసిన అల్ ఖైదా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో దాడులు చేస్తామని పేర్కొంది.

దీనిపైనే భారత భద్రతా సంస్థలు దృష్టి సారించాయి. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు, మెట్రోస్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో నిఘా పెట్టాలని చెప్పాయి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి