హిందూ సంప్రదాయాలపై దాడులు కొనసాగిస్తున్న డీఎంకే సర్కార్.. తాజాగా ఆలయ సిబ్బంది బదిలీల్లో నిబంధనలు సవరణ!

తమిళనాడు: ఇక్కడి డీఎంకే ప్రభుత్వం హిందూ సంప్రదాయాలపై దాడులు కొనసాగిస్తోంది. తాజాగా.. పూజారితో కూడిన ఆలయ సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేయడానికి హిందూ మత, దేవాదాయ బోర్డు చట్టంలోని నిబంధనలను సవరించింది. దురదృష్టవశాత్తు, వివిధ సంప్రదాయాలను అనుసరించి దేవాలయాల నుండి పూజారులను బదిలీ చేయడానికి ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చినప్పటికీ, సవరణ చెల్లుబాటు అవుతుందని కోర్టు తీర్పు చెప్పింది. రెండు సంవత్సరాల క్రాష్ కోర్సు తర్వాత పూజారిలుగా సర్టిఫికేట్ పొందిన వ్యక్తులను నియమించిన తర్వాత, డీఎంకే ప్రభుత్వం ఇప్పటికీ హిందూ సమాజ ధర్మాన్ని నాశనం చేయడంలో కనికరం లేకుండా వ్యవహరిస్తోంది.

అక్టోబర్ 2021లో, డీఎంకే ప్రభుత్వం తమిళనాడు హిందూ మత సంస్థల ఉద్యోగుల (సేవా నిబంధనలు) రూల్స్, 2020లోని రూల్ 17ను సవరించి, ఆలయ సిబ్బందిని తనకు తగినట్టుగా బదిలీ చేయడానికి హెచ్.ఆర్.సీ.ఇ కమిషనర్‌కు అధికారాలను ఇచ్చింది. ఆలయ సిబ్బందిలో పూజారులు, మాడపల్లిలో పనిచేసేవారు (ప్రసాదం తయారు చేసే ఆలయ వంటగది), ఇతర సేవకులు కూడా ఉంటారు. సాధారణంగా, ఈ వ్యక్తులు తరతరాలుగా దేవాలయాలలో పని చేస్తారు. చిన్ననాటి నుండి వారి పూర్వీకుల నుండి సంప్రదాయాలను నేర్చుకుంటారు.
కొన్ని ఆలయాలకు ఆగమాలు సాధారణమైనప్పటికీ, ఒక్కో ఆలయానికి ఒక్కో విధమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. పండుగలు, ఉత్సవాలు, ప్రసాదాలు, దాదాపు ప్రతిదీ దేవాలయం నుండి దేవాలయానికి మారుతూ ఉంటుంది. అదే ఆగమాన్ని అనుసరించే దేవాలయాలలో కూడా పూజారులు, ఇతర సిబ్బందిని బదిలీ చేయడం సముచితం కాదని పలువురు భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దాల నాటి సంప్రదాయాలను నిర్మూలించడానికి డీఎంకే ప్రభుత్వం ఇటువంటి బదిలీలకు పూనుకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Source: HINDU POST





