News

వచ్చే పదేళ్ళ‌లో భారత్‌కు దిక్సూచి కానున్న ఉత్తరప్రదేశ్: మోదీ

288views

ల‌క్నో: సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందని చెబుతూ వచ్చే పదేళ్ళ‌లో భారతదేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు.

లక్నోలో యూపీ పెట్టుబడుదారుల సదస్సులో సుమారు రూ. 80 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, ఇదొక రికార్డు అని కొనియాడారు. లక్నోలో జరుగుతున్న మూడో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తూ ఈ పెట్టుబడుల ఫలితంగా యువత ఎక్కవ ప్రయోజనం పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం ఇటీవలే 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. సంస్కరణలు, పనితీరు.. ఇతర వాటిని అమలు పరుస్తూ పురోగించడం జరిగిందని పేర్కొన్నారు. సమన్వయంతో చేసుకుంటూ సులభంగా వ్యాపారం చేయడంపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి