
కశ్మీర్: కశ్మీర్‌లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హత్యలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు ఒక వంక చేబడుతూ, మరోవంక ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు భద్రతను పటిష్ఠ పరిచారు. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గత పక్షం రోజులలో రెండుసార్లు ఈ విషయమై అత్యున్నతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్ష జరిపారు.
శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఆర్ అండ్ ఏడబ్ల్యూ చీఫ్ సమంత్ సమంత్ గోయల్ హాజరయ్యారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు.
లోయలో కొందరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నా జూన్ 30వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అమర్‌నాథ్ యాత్రను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఈ ప్రాంతంలో భద్రతను పెంచనున్నట్టు తెలిపారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





