
488views
గాంధీనగర్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చిన్న సైనికుడిగా పని చేయబోతున్నట్లు హర్దిక్ తెలిపారు.
ప్రధాని మోదీ మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేని ప్రజల కోసం బీజేపీలో చేరుతున్నట్టు హార్దిక్ తెలిపారు. గాంధీనగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో హార్దిక్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.
Source: Nijamtoday





