News

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పరిమితి విధించిన టీటీడీ

525views

తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీటీడీ లడ్డూలపై పరిమితి విధించింది. ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు మాత్రమే కొనుక్కోడానికి అనుమతి ఇస్తున్నారని భక్తులు తెలిపారు. గతంలో రూ.50 చొప్పున ఎన్నయినా కొనుక్కునే వీలు ఉండేది. ప్రస్తుతం భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో లడ్డూలను పరిమిత సంఖ్యలోనే కొనేందుకు అనుమతిస్తున్నారు.

ప్రతిరోజు సుమారు మూడు లక్షల వరకు లడ్డూలను టీటీడీ తయారుచేస్తోంది. భక్తుల సంఖ్య ప్రస్తుతం 90 వేలకు మించుతోంది. దీనిపై లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం అధికారులను సంప్రదించగా ఆదివారం భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఒక ఉచిత లడ్డూ, రెండు అదనంగా కొనేందుకు అనుమతించామని, ప్రస్తుతం రద్దీ తగ్గడంతో నాలుగింటికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి