News

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బ్యాంక్‌లో కాల్పులు!

342views

క‌శ్మీర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పౌరుడు గాయపడ్డారు. తాజాగా కుల్గామ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా వద్ద ఉన్న ఎల్లకీ దేహతీ బ్యాంకులో మేనేజర్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర ఘాతుకంలో మేనేజర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధిత వ్యక్తి రాజస్తాన్‌లోని హనుమాన్ ఘర్ నివాసి. ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వరసగా టార్గెట్ దాడులు చేస్తున్నారు టెర్రరిస్టులు. నిన్న షోఫియాన్ జిల్లా కేగామ్‌లో ఫారఖ్ అహ్మద్ షేక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగారు. అంతకుముందు వారం క‌శ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కాల్చిచంపారు. ఇటీవల హిందూ మహిళా టీచర్‌ను కూడా కాల్చి చంపారు టెర్రిరిస్టులు. అమ్రీన్ భట్‌ను కాల్చి చంపిన టెర్రిరిస్టులను 24 గంటల్లోనే మట్టుపెట్టాయి భద్రతా ద‌ళాలు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి