
452views
తిరుపతి: తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరిలో తనిఖీ చేస్తామని.. ప్లాస్టిక్ రహిత వస్తువులనే తిరుమలకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిస్తున్నామన్న టీటీడీ అధికారులు.. తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధానికి దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు పెట్టాలని సూచించారు.





