News

మరోసారి బయటపడ్డ యాదాద్రి ఆలయ పనుల్లోని డొల్లతనం!

478views

యాద‌గిరిగుట్ట‌: యాదగిరిగుట్టలో మంగళవారం వర్షం కురిసింది. సాయంత్రం..ఒక్కసారిగా చల్లబడి ఉరుములు.. మెరుపులు, ఈదురు గాలులతో సుమారు అరగంట పాటు వర్షం కురిసింది. దీంతో కొండపైన క్యూ కాంప్లెక్స్​ ఎక్స్​లేటర్ సమీపంలో స్లాబ్ సీలింగ్​పైనుంచి వర్షం నీళ్లు లీక్ అవుతున్నాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి యాదాద్రి కొండపై భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

మొదటి ఘాట్ రోడ్డును కలిపేందుకు ఏర్పాటు చేస్తున్న ఫ్లై ఓవర్ వద్ద మట్టి కొట్టుకు పోయింది. ఘాట్ రోడ్డు వద్ద వాహనాలు పైకి వెళ్లే దారి సమీపంలో వర్షం నీరు నిలిచిపోవడంతో అక్కడ మరమ్మతులు చేశారు. మోస్తరు వర్షం కురిస్తే చాలు.. కోట్లాది రూపాయలతో నిర్మించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు డొల్లతనం బయటపడుతూనే ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి