News

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

379views

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఈ మేరకు 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచి హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్‌, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

తిరుపతి- హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక సర్వీసులు నడపనుండగా.. ఇవి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగనున్నాయి. తిరుపతి- కాకినాడ టౌన్‌ మధ్య 10 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు నిర్ణయం తీసుకోగా.. ఇవి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

మరోవైపు కాచిగూడ- తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైలు జూన్ 1, జూన్ 2న నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు.. ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వేస్టేషన్లో ఆగుతాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.