
439views
దేశ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు.
కోల్ కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుంది.





