
605views
* కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్న ప్రధాని మోడీ
* దేశవ్యాప్త నిర్వహణకు కసరత్తు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు సిమ్లాలో పర్యటించనున్నారు. 8 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించే గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ లో ప్రధాని పాల్గొంటారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆయన ముచ్చటించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలతో సంభాషించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమం అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపింది.





