
478views
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపనున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ఐసీఎఫ్‌లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్ ఎల్‌హెచ్‌బీ కొచ్‌లను జెండా ఊపి ప్రారంభించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఐసీఎఫ్ కర్మాగారంలో తయారు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. దక్షిణ రైల్వే అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలందించటంలో అన్న జోన్ల కంటే ముందున్నారని ప్రశంసించారు.
Source: Nijamtoday





