News

తమ యావదాస్తి గోశాలకు విరాళం

465views
  • ఆదర్శంగా నిలిచిన మధ్యప్రదేశ్ హిందూ కుటుంబం

భోపాల్‌: మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్​లో చిన్నపాటి బంగారం, వెండి నగల దుకాణం ప్రారంభించిన రాకేష్ సురానా అనే వ్యక్తి…. వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధించి కోట్లకు పడగలెత్తారు. పేరు, కీర్తి రెండూ లభించాయి. ఆయనకు భార్య లీనా సురానా(36), కుమారుడు అమయ్ సురానా(11)ఉన్నారు. అయితే, కోట్లు సంపాదించినా జీవితంలో ఇంతకుమించినదేదో వెతుక్కోవాలని భావించాడు రాకేష్. భార్య, కొడుకుతో కలిసి ఆధ్యాత్మికత బాటలో పయనించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన యావదాస్తి(రూ.11కోట్లు)ని ఆస్తిని గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు రాసిచ్చారు.

తన ఆధ్యాత్మిక గురువు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాకేష్ ​ సురానా తెలిపారు. ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా రాకేష్ సురానా మాట్లాడుతూ..”డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదు. మనమేంటి అని గుర్తించడమే జీవితం పరమార్థం. మానవుల కోరికలకు ఎప్పటికీ అంతం ఉండదు. మతం, ఆధ్యాత్మికత విలువల గురించి గురు మహేంద్ర సాగర్ మహరాజ్​, మనీశ్ సాగర్ ​తో గడిపినప్పుడు తెలుసుకున్నా. నా భార్య కూడా చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకుంది.

నా భార్య లీనా అమెరికాలో చదువుకుంది. అలాగే, బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి ప‌ట్టా పొందింది. ఇక నా కుమారుడు అమయ్ సురానా కూడా నాలుగేళ్ళ నుంచే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాడు. అమయ్ సురానా నాలుగేళ్ళ‌ వయసులో ఆధ్యాత్మికం గురించి మాట్లాడేవాడ‌”అని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి