News

వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు

526views
  • కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

బెంగ‌ళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన వారు తప్ప లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తెల్లవారుజామున మైకుల్లో ఆజాన్ ఇచ్చేందుకు మసీదులకు అవకాశం లేకుండా పోయింది.

మహారాష్ట్రలోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ మహా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లౌడ్ స్పీకర్లపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంరాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి