
499views
ప్రజల నుంచి పెల్లుబికిన ఆగ్రహంతో అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న శ్రీలంకకు.. భారత బలగాలను పంపుతున్నట్లు వస్తున్న వార్తలను భారత్ ఖండించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. శ్రీలంకకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని.. ఆ దేశ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, స్థిరత్వానికి, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కావాల్సిన సాయం మాత్రం అందిస్తామని తెలిపింది. అంతే తప్ప బలగాలను పంపే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసింది.





