News

ఏపీ తీరానికి కొట్టుకు వచ్చిన బంగారు రథం

552views

తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. భారీ అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ.. బంగారు వర్ణంలో ఉన్న ఓ రథం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవు వద్దకు కొట్టుకొచ్చింది. ఈ రథంపై 16-1-2022 తో పాటు విదేశీభాష కనిపిస్తోంది. ఇది థాయిలాండ్, మలేషియా, జపాన్ దేశాలకు చెందినదై ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. సముద్రంలో ఇంత దూరం రథం కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రథాన్ని చూడ్డానికి స్థానికులు పోటెత్తారు. దీని గురించి సమాచారం అందడంతో మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.