News

శ్రీశైలమల్లన్న భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు

577views

శైలం: శైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈవో లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూలైన్లలో ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు మంచినీరు అల్పాహారం యథావిధిగా కొనసాగించాలన్నారు.

క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. పర్వదినాలు సెలవురోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటున్నందున డార్మెంటరిలలో అదనపు స్నానపు గదులు ఏర్పాటు చేయాలని ఈఓ లవన్న సూచనలిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి