321
-
నవల ‘నృసింగహ’ను ఆవిష్కరించిన మిజోరం గవర్నర్ కంభంపాటి
విశాఖపట్నం: మన సంస్కృతిలోని నైతికత, విలువల వైపు నడిపించే ఆధ్యాత్మిక అంశాలను యువతలో పెంపొందించాలని మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన ఆధ్యాత్మిక నవల ‘నృసింగహ’ ను గవర్నర్ హరిబాబు విశాఖలో ఆవిష్కరించారు.
ఈ పుస్తకం సమాజంలోని సాంఘిక దురాచారాలను ఎంతో సృజనాత్మకంగా ప్రస్తావించిందని.. దేశంలోని ఆధ్యాత్మిక మూలాల అంతర్‌దృష్టిని చదవడానికి యువతీయువకులను ప్రోత్సహిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్కృతిని పెంపొందించేందుకు కృషిచేస్తున్న రచయితలను గవర్నర్ అభినందించారు.
Source: EtvBharat