
విజయవాడ: దేవదాయశాఖలో నిబంధనల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయి. కోట్లాది రూపాయల రాబడి ఉండే పలు ప్రధాన ఆలయాలకు రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు.. అర్హత లేకపోయినా సరే ఈవోలుగా కొనసాగుతున్నారు. ప్రధాన ఆలయాలకు దేవదాయ శాఖలోని ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌లు ఈవోలుగా ఉండాలి.
ఒకవేళ ఆ అర్హత కలిగిన అధికారులు లేకపోతే.. రెవెన్యూశాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను డిప్యూటేషన్‌పై ఈ ఆలయాలకు ఈవోలుగా నియమించేందుకు వీలుంది. కానీ శ్రీకాళహస్తి, కాణిపాకం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల ఆలయాలకు చాలా కాలంగా రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన డిప్యూటీ కలెక్టర్లు ఈవోలుగా పనిచేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లు ఆరేళ్ళు సర్వీసు చేసిన తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అవుతారు.
కానీ, నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ కలెక్టర్లనే ఆలయాలకు ఈవోలుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. దీన్ని హైకోర్టులో ఒకరు సవాల్ చేయడంతో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Source: EtvBharat





