
లక్నో: అసదుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నేత మొహమ్మద్ రువేద్ సబీర్, అతని భార్య సమీనా పర్వీన్ హిందూ మతంలోకి మారాలని భావిస్తున్నారు. ఈ దంపతులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయం కోరారు.
తమ సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులు, సంస్థల నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ విషయమై భార్యాభర్తలు మొరాదాబాద్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తమకు నచ్చిన మతంలోకి మారడం వీలవ్వడం లేదని ఫిర్యాదులో దంపతులు రాశారు. హిందూ మతంపై విశ్వాసం ఉందని, ఈ ప్రక్రియను ప్రారంభించడానికి తమ సంఘం నుండి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు.
ఏప్రిల్ 11న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, ఎ.ఐ.ఎం.ఐ.ఎం మాజీ నాయకుడి భార్య సమీనా పర్వీన్ తన అత్తమామలతో పోరాడుతున్నప్పుడు తమ సామాజికవర్గం నుండి ఎవరూ తమకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో మానసికంగా కుమిలిపోయింది.
దీంతో తాము హిందూ మతంలోకి మారాలనుకుంటున్నట్టు చెప్పారు. కట్నం కోసం అత్తామామలు ఆమెను వేధించే వారని, న్యాయం కోసం చాలా మంది ముస్లిం నాయకులు, సంస్థల తలుపులు తట్టినట్టు ఆమె పేర్కొంది. అయితే ఆమెను ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదు. అయితే స్వచ్ఛందంగా మతం మారే ప్రక్రియలో సహాయం కోసం ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను సంప్రదించింది.
Source: NationalistHub





