News

ఢిల్లీలోని హనుమాన్ ర్యాలీపై దాడి: కీలక నిందితుడు అస్లాం అరెస్ట్‌

558views

ఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడిన 14 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ళ‌ యువకుడు ఎండీ అస్లాం కూడా ఉన్నాడు.

శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎండీ అస్లాం ఉపయోగించిన పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం జహంగీర్‌పురి సిడి పార్క్‌లోని స్లమ్ క్లస్టర్‌లో నివసిస్తున్నాడు. ”నిందితులైన వ్యక్తులలో ఒకరు, అస్లామ్‌గా గుర్తించిన వ్యక్తి ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై కాల్పులు జరిపాడు.

నేరం సమయంలో నిందితుడు ఉపయోగించిన పిస్టల్‌ను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాము” అని డీసీపీ (వాయువ్య) ఉషా రంగాని తెలిపారు. గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. అతని చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే అతని ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి