News

అధికారుల నిర్ల‌క్ష్యం.. పుష్క‌రిణిలో మునిగి భ‌క్తుడు మృతి

559views

సింహాచలం: అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం దేవస్థానానికి శ‌నివారం ఉదయం విచ్చేశాడు. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో రెండు నెలల కిందట ఓ భక్తుడు పుష్కరిణిలో స్థానాలకు వీలుగా పూడికలు తీయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ… మరోవైపు బురద నీటిలో భక్తులు స్నానాలు చేస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు తీసుకోలేదని, భక్తులు మండిప‌డుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి