News

108 అడుగుల హనుమ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

522views

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామికావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హనుమాన్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

అంతకుముందు మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, నేడు మనం హనుమాన్ జయంతి ఉత్సవాలను జ‌రుపుకొంటున్నామ‌న్నారు. మోర్బిలో శనివారం ఉదయం 11 గంటలకు 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం రావడం గౌరవప్రదంగా భావిస్తున్నానని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి