News

తీవ్రవాదుల ప్లాన్ భగ్నం!

468views

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ప్లాన్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రాజౌరి గుర్దాన్ రోడ్డులో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐ.ఇ.డి) పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తీవ్రవాదుల కుట్రను భగ్నం చేశామని రాజౌరి పోలీసుల అధికారిక ప్రకటనలో తేలింది. స్వాధీనం చేసుకున్న ఐఈడీని తర్వాత సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. బాంబ్ స్క్వాడ్ ఆఫ్ పోలీస్, ఎస్‌.ఒ.పిల ప్రకారం దీని వ‌ల్ల ఎంతో విధ్వంసం చోటుచేసుకుని ఉండేదని పేర్కొన్నాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి