News

ఉక్రెయిన్ పై యుద్ధం ఆపడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి – ఉక్రెయిన్

557views

* ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం వహిస్తామంటే స్వాగతిస్తాం… ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి వెల్లడి

ర్కీలో శాంతి చర్చల అనంతరం మీడియా సమావేశంలో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మాట్లాడుతూ… భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. రష్యాతో భారత్‌ కలిగి ఉన్న సంబంధాలను సద్వినియోగం చేసుకుని, పెద్దన్న పాత్ర పోషిస్తూ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ‌ని ఒప్పించాలని తాము భారత ప్రధానిని అభ్యర్తిస్తున్నామని పేర్కొన్నారు. రష్యాలో అన్ని నిర్ణయాలు తీసుకునే ఏకైక వ్యక్తి పుతిన్‌ కాబట్టి ఆయనతో భారత ప్రధాని మోడీ నేరుగా మాట్లాడి యుద్ధం ఆపేలా చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు.

భారత్ కు‌ రష్యాతో గల సంబంధాలనుపయోగించి ఈ యుద్ధం ఆపేలా చేస్తే ఉక్రెయిన్‌లో ఇన్ని వేల ప్రాణాలు బలవ్వవు కదా అని ఉక్రెయిన్ వెల్లడించింది. ఖార్కివ్ ‌లో రష్యా బాంబు దాడిలో మృతి చెందిన భారత విద్యార్థికి విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.