
621views
అనంతపురం: ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా దానిలో ఏపీ నుంచి అనంతపురానికి చెందిన లేపాక్షి ఆలయం ఉండటం విశేషం. మరో ఆరు నెలల్లో వారసత్వ కట్టడాలపై యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. శిల్ప సంపదకు నెలవైన లేపాక్షి వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలిక గుర్తింపు దక్కడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





