News

జమ్మూలో ఉగ్రవాద కుట్ర భగ్నం

531views

జ‌మ్మూ: జమ్మూలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వీరి నుంచి ఒక పిస్తోలు సహా పలు ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రి, తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

బుద్గాం జిల్లా సున్నెర్‌గుండ్ ప్రాంతంలో ఈ ఇద్దరినీ అరెస్టు చేశామని, వీరిని షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ గనై, ఇక్బాల్ అష్రాఫ్ షేక్‌గా గుర్తించామని వెల్లడించారు. ఒక చైనా పిస్తోలు, రెండు పిస్తోల్ మేగజైన్లు, 12 పిస్టర్ రౌండ్లు, 32 ఎకే-47 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. చట్ట ప్రకారం వివిధి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి