News

“ది కాశ్మీర్ ఫైల్స్” థియేటర్లలో RSS ప్రార్థన చేస్తున్న ప్రేక్షకులు

738views

“ది కాశ్మీర్ ఫైల్స్” చలన చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.90లలో కాశ్మీర్లో హిందువులపై ముస్లిములు, పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు జరిపిన దారుణ మారణ హోమానికి దృశ్య రూపమే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చలన చిత్రం.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చలనచిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లు “భారత్ మాతాకీ జై” నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కొన్ని రాజకీయ పార్టీలు హిందువులకు చేసిన ద్రోహాన్ని తెలుసుకుని రగిలిపోతున్నారు. ఈ చలనచిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లలో “భారత్ మాతాకీ జై” నినాదాల తోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రార్థన కూడా చేస్తూండడం గమనార్హం.

దేశంలోని పలు రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు దశాబ్దాలుగా తొక్కిపెట్టిన అనేక వాస్తవాలను ఈ చలన చిత్రం కళ్లకు కట్టింది. నిజాలను నిర్భయంగా తెరకెక్కించిన చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మీడియా ఈ చలన చిత్రానికి పెద్దగా ప్రాచుర్యం కల్పించకపోయినా…. సోషల్ మీడియాలో ఈ చలన చిత్రానికి లభించిన మద్దతు, ప్రచారం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని చూడటానికి ఉత్సుకత చూపుతున్నారు. ఈ చలనచిత్రం ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లు “భారత్ మాతాకీ జై” నినాదాలతో హోరెత్తుతున్నాయి. అలాగే పలు థియేటర్లలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రార్థన కూడా చేస్తూ ఉండడం గమనార్హం. మూడు దశాబ్దాల క్రితం కాశ్మీర్లో హిందువులపై జరిగిన ఊచకోతకు దృశ్య రూపంగా మలచిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు భారమైన గుండెలతో థియేటర్లను వీడుతున్నారు. ఈ చిత్రం అన్ని భారతీయ భాషలలోకి అనువదింపబడి, విస్తృతంగా ప్రదర్శింపబడాలని వారందరూ ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.