News

రష్యా నుండి ఆయుధ సరఫరాపై భారత్ ఆందోళన

401views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన విష‌యం విదిత‌మే. నేప‌థ్యంలో ఆ దేశం నుండి భారత్‌కు జరుగుతున్న ఆయుధాల సరఫరాపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. భ‌విష్య‌త్‌లో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.

60 నుండి 70 శాతం ఆయుధాలు, ఆయుధ పరికరాల సరఫరాకై భారత్ రష్యాపై ఆధారపడుతున్నది. ఖార్కివ్‌లో అశువులు బాసిన కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని వెనక్కి తెచ్చేందుకు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేయాలని ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఎక్కువ ఆయుధాలను రష్యా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సిగ్ గత వారం త్రివిధ దళాధిపతులను కలిసి పరిస్థితిని సమీక్షించారు. రష్యా నుంచి సరఫరా కావాల్సి ఉన్న ఆయుధాలు, డెలివరీ, విడిభాగాల నిల్వలు, మెయింటెనెన్స్ వంటి అంశాలను సమీక్షించారు. విడి భాగాల నిల్వలు ఆరు నెలలకు పైగా సరిపోతాయని రక్షణ విభాగాలు భరోసా ఇచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి