News

ఉత్తర ప్రదేశ్‌లో యోగిదే హ‌వా..! ఎగ్జిట్ పోల్స్

579views

ల‌క్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల పోలింగ్‌లో చివరి దశ సోమవారం ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసిన్నట్లయింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అయితే, వివిధ మీడియా సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో మరోమారు ఉత్తర ప్రదేశ్ లో బిజెపి నేత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్టు వెల్లడైనది.

ఈ ఫలితాలు వాస్తవమైతే ఆ రాష్ట్రంలో మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా ఒక ప్రభుత్వం తిరిగి ఎన్నికై చరిత్ర సురస్టించిన్నట్టు కాగలదు. 2017 నాటి కన్నా సీట్లు తగ్గినా, స్పష్టమైన ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే, పంజాబ్‌లో ఆప్ ముందంజలో ఉన్నదని, మణిపూర్‌లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందని, గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చని ఈ సర్వేలు వెల్లడించాయి. కాగా, ఉత్తరాఖండ్‌లో మాత్రం భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. కొన్ని సర్వేలు బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాగలదని స్పష్టం చేస్తుండగా, మరొకొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

యుపిలో మొత్తం స్థానాలు 403… బిజెపికి 232 స్థానాలు, సమాజ్‌వాదిపార్టీకి 150 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో వెల్లడైంది. నాలుగు సంస్థల ఎగ్జిట్ పోల్స్‌తో వెలువడ్డ సగటు ఫలితాన్ని విశ్లేషించుకుంటే ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, మిత్రపక్షాలు 231 స్థానాలను దక్కించుకుంటాయి. ఇక్కడ మెజార్టీ స్థాపనకు అవసరం అయిన సంఖ్యాబలం 202.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి