News

ప్రపంచంలో అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం భారతదేశం

599views
  • భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ప్రపంచంలో మరో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించని ఒకే ఒక్క దేశం ఇండియా అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ 98వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఏ దేశంపైనా దురాక్రమణ చేయని దేశం ఇండియా అన్నారు.

‘‘భారత దేశానికి ఉన్న శక్తి ప్రపంచ సంక్షేమం కోసమే. ఏ దేశాన్నో భయపెట్టడం కోసం కాదు. మా లక్ష్యం దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే. దేశాన్ని శక్తివంతంగా, ఆర్థికంగా, ఉన్నత విలువలతో తీర్చిదిద్దాలనుకుంటున్నాం. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా దేశ సమగ్రత, సమానత్వం, స్వేచ్ఛ గురించి తలచుకోవాలి. మన దేశానికి చెందిన ఎందరో గురువులు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారు. జీసస్ పుట్టుకకు ముందే మన దేశంలో సర్జరీలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి