News

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు

567views

తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13వేల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది.

అలాగే మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ఉదయం తొమ్మిది గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్టు పేర్కొంది. మార్చి నెలకు సంబంధించి సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన టీటీడీ.. నిత్యం అయిదు వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనుంది. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు వెల్లడించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి