
భాగ్యనగరం: హైదరాబాద్ శివారు శంషాబాద్‌కు సమీపంలో ఉన్న ముచ్చింతల్‌లోని ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని ఆనందిస్తున్నారు.
అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శిస్తున్నారు. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ బుధవారం సాయంత్రం రామనగరికి చేరుకున్నారు.
ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామితో ఆశ్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, మోహన్ భాగవత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడి నుంచి శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 దివ్య క్షేత్రాలను వారు సందర్శిస్తారు. అనంతరం ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో వారు ప్రసంగించనున్నారు.
Source: Tv9





