News

అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 49 మందిపై నేర నిర్ధారణ

617views

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిగింది. నేరస్థులు 49 మందికి శిక్షలు ఖరారు చేయడం బుధవారం నుంచి ప్రారంభమౌతుందని కోర్టు వెల్లడించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.