
240views
బరంపురం: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమీప గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఘటనా స్థలంలో పోస్టర్ను అతికించి వెళ్ళారు.