
-
15 రకాల పంచగవ్య ఉత్పత్తుల తయారీ
-
రేపటి నుంచి ప్రదర్శన, అధికారుల వెల్లడి
తిరుపతి: కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తుల ప్రదర్శనను ఈనెల 27వ తేదీ ప్రారంభిస్తున్నామని జెఈవో శ్రీ వీరబ్రహ్మం బుధవారం తెలిపారు. తిరుపతి డిపిడబ్ల్యు స్టోర్ లోని తయారీ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీటీడీ గో సంరక్షణకు పెద్దపీట వేస్తోందన్నారు.
ఇందులో భాగంగానే పంచగవ్య ఉత్పత్తుల తయారీకి పూనుకుందని చెప్పారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ప్రత్యేక శ్రద్ధతో తక్కువ సమయంలోనే ఈ ఉత్పత్తుల తయారీ సాకారం అయ్యిందన్నారు. దీంతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్ర పటాలు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు కూడా అదే సందర్భంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించడానికి పలు ఆసుపత్రులతో ఎంఓయు కుదుర్చుకోనున్నట్టు వెల్లడించారు.





