
549views
తిరుచానూరు: ప్రపంచశాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవకుండాత్మక శ్రీయాగం ఆదివారం మూడో రోజు కొనసాగుతోంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అర్చకులు శ్రీ వేంపల్లి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి మధ్యాహ్నం వరకు చతుష్టానార్చన, హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, హారతి, వేద విన్నపం నిర్వహించారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు.





