News

కన్యాకుమారిలో స్వామి వివేకానంద సభ గృహం ప్రారంభం

344views

క‌న్యాకుమారి: కన్యాకుమారిలో కొత్త‌గా నిర్మించిన స్వామి వివేకానంద సభ అనే పేరుగ‌ల గృహాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్‌ మోహన్‌ భగవత్ జీ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ తమిళనాడు ఎక్సలెన్సీ గవర్నర్ ఆర్.ఎన్. రవి(ఐపీఎస్‌, రిటైర్డ్‌) పద్మశ్రీ నివేదిత భిడే రచించిన మిషన్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ – ఇండియన్ కల్చర్ ఛాలెంజెస్ & పొటెన్షియాలిటీస్ అనే పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర అధ్యక్షుడు బాలకృష్ణన్‌ జీ, వెల్లిమలై స్వామి పూజ్య చైతన్యానంద మహరాజ్‌ జీ, కేంద్ర కార్యదర్శి బానుదాస్ జీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి