News

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు

536views

అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్ చేశారు.

చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్​ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్టు తెలిపారు. యువకుడిని త్వరగా విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్టు తాపిర్ తెలిపారు. ఇదే ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి