News

పేద భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనం

489views
  • రవాణా, వసతి ఖర్చులు టీటీడీవే…

తిరుప‌తి: గత బ్రహ్మోత్సవాల సమయంలో పేద భక్తులకు ఉచితంగా శ్రీనివాసుడి దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ..ఈ సారి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు భక్తులకు కూడా అవకాశం ఇస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సిద్ధమైంది. మూడు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేద భక్తులకు ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యాలతో స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి