News

తక్కువ వడ్డీకే అన్నదాతకు రుణాలు

486views
  • ట్విట్టర్ వేదికగా ఎస్‌బిఐ ప్రకటన

న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు తీపికబురు అందించింది. అన్నదాతలకు సులభంగానే రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అతితక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారానే ఈ తరహా రుణాలు పొందొచ్చని పేర్కొంది. అంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్‌కు వెళ్లి బంగారు ఆభరణాలు అందించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి