News

ముస్లింల‌కు రాజ్యాధికారం కావాలంటే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాలి

643views
  • ఏఐఎంఐఎం అలీగఢ్​ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్​ నూర్​ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో విజ‌యం సాధించేందుకు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాలు చేస్తున్నాయి. ఆల్​ ఇండియా మజ్లిస్​​ ఈ ఇత్తెహాదుల్​ ముస్లిమీన్​(ఏఐఎం​ఐఎం​) అధినేత అసదుద్దీన్​ ఓవైసీ సైతం యూపీలో పాగా వేయాలని చూస్తున్నారు. ముస్లిం సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐఎంఐఎంకి చెందిన ఓ జిల్లా అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ వీడియోలో ఓవైసీని ప్రధాన మంత్రి చేసేందుకు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సలహా ఇచ్చారు.

ఏఐఎంఐఎం అలీగఢ్​ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్​ నూర్​ ఆ వీడియోలో మాట్లాడుతూ…’ పిల్లలు లేకపోతే మనం రాజ్యాధికారం ఎలా సాధిస్తాం? ఓవైసీ సాబ్​ ఎలా ప్రధాని అవుతారు. శైకత్​ సాబ్​ ఎలా ముఖ్యమంత్రి అవుతారు? దళితులు, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనకూడదని కట్టడి చేస్తున్నారు. అలా ఎందుకు? అది షరియత్​కు వ్యతిరేకం.’ అని పేర్కొన్నారు. ఆ వీడియో బుధవారం రికార్డ్​ చేసినట్టు తెలుస్తోంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి