News

పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​!

680views

తిరువ‌నంత‌పురం: పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​ తరలించేందుకు యత్నించిన ఓ నైజీరియన్​ను బెంగళూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు థామస్​ కౌల్​గా గుర్తించారు. అతడి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 260 డ్రగ్​ పిల్స్​, 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన పాలపొడి ప్యాకెట్లలో నిందితుడు గంజాయిని సరఫరా చేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.

థామస్​ ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు అంజుమ్​ జంగ్​ అనే మహిళకు నోటీసులు పంపారు. ప్రెస్టీజ్​ గ్రూప్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజుమ్​ నిందితుడు వద్ద నుంచి డ్రగ్స్​ కొనుగోలు చేసేదని పోలీసులు తెలిపారు. ఇదిలావుండ‌గా, అన్నపూర్ణేశ్వరీ ఠాణా​ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కాలేజీ విద్యార్థులకు నిందితులు గంజాయిని పంపిణీ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి