
-
‘విజయ్ దివస్’లో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: మనం కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 50వ విజయ్ దివస్ సందర్భంగా గురువారం ఢిల్లీలోని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ ఘన నివాళులు అర్పించి, మాట్లాడారు. సరిగ్గా 50 ఏళ్ళ కిందట అంటే 1971లో పాకిస్తాన్‌ను ఓడించి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16న విజయ దివస్‌గా జరుపుకొంటున్నామన్నారు. కాగా, 50వ విజయ్ దివస్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్.. కోవింద్‌ను ‘గౌరవ అతిథి’గా ఆహ్వానించారు. విజయ దివస్ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులోని వార్ మెమోరియల్ వద్ద అప్పటి యుద్ధంలో అమరులైన భారత సైనికులకు తూర్పు నావికాదళం నివాళులర్పింది. ఈ కార్యక్రమంలో నావల్ ప్రొజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ పాల్గొన్నారు. వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
Source: TV9





