
534views
ఢాకా: బాంగ్లాదేశ్ లో మూడు రోజుల పర్యటనకు బుధవారం ఢాకా చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందిన స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. కోవింద్ రాకతో 21 తుపాకుల గౌరవ వందనం జరిగింది.
కోవింద్ తన భార్య సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్‌తో కూడిన అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి ప్రత్యేక ఎయిర్ ఇండియా వన్ విమానంలో ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎం. అబ్దుల్ హమీద్ ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సతీమణి రషీదా ఖానుమ్ తో కలసి స్వాగతం పలికారు.
Source: Nijamtoday





