News

నేడు స్వస్థలానికి సాయితేజ మృతదేహం

674views

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో సంభ‌వించిన‌ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్‌నాయిక్‌ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు తెలిపారు. విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నట్టు వెల్లడించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని చెప్పారు.

  • నేడు స్వగ్రామానికి సాయితేజ భౌతిక‌కాయం

నేడు స్వగ్రామం ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరనుంది. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో..అహోరాత్రులు శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు సాయి తేజ‌. పారా కమాండోగా చెరగని ముద్రవేసి, త్రిదళపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు. రావత్ భద్రతా బృందంలో చోటు సంపాదించారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఈ తెలుగుతేజం.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి